బీఆర్‌‌‌‌ఎస్ చచ్చిన పాము..ఆ పార్టీకి పార్లమెంట్‌‌ అభ్యర్థులు దొరకట్లేదు : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

బీఆర్‌‌‌‌ఎస్ చచ్చిన పాము..ఆ పార్టీకి పార్లమెంట్‌‌ అభ్యర్థులు దొరకట్లేదు : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

 నల్గొండ అర్బన్, వెలుగు : బీఆర్ఎస్​ చచ్చిన పాము అని, ఆ పార్టీకి పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులే దొరకడం లేదని  ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు.  ముగ్గురు సిట్టింగ్​ ఎంపీలు బీజేపీలోకి వెళ్లారని,  మరోఎంపీ రంజిత్​రెడ్డికి టికెట్‌‌‌‌ ప్రకటించినా ఆయన పోటీకి ముందుకురాలేదని గుర్తుచేశారు.

బుధవారం నల్గొండ బైపాస్ రోడ్  వద్ద రూ.55 కోట్లతో విలీన గ్రామాల్లో నిర్మించనున్న సీసీ రోడ్లు, మురుగు  కాల్వల నిర్మాణం పనులు,  ఎన్జీ కాలేజీ వద్ద రూ. కోటితో నిర్మించనున్న  హెల్త్ అండ్ హైజిన్ స్ట్రీట్ ఫుడ్ కోర్టు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..  మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఆంధ్రా చేపల పులుసుకు ఆశపడి తెలంగాణకు ద్రోహం చేశారని ఆరోపించారు.  

ఏపీ మంత్రి రోజా ఇంట్లో   చేపల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ కావాలని అనలేదా..? అని ప్రశ్నించారు.  ఏపీ సీఎం జగన్‌‌‌‌ కృష్ణా నీటిని దొచుకెళ్తుంటే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలు కల్లప్పగించి చూశారే తప్ప అడ్డుకునేందుకు ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు.  ఏఎమ్మార్పీ, డిండి, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి ఉంటే కరువు ఉండేది కాదన్నారు.  అనంతరం పానగల్‌‌‌‌లో ఉన్న 19.6  ఎంఎల్డీ నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు.  జి.ఎడవల్లి, తెలకంటి గూడెం నీటి శుద్ధి కేంద్రాలను పునరుద్ధరికరించి  గ్రామాలతో పాటు, చండూరు మున్సిపాలిటీకి తాగునీరు సరఫరా చేచేయాలని  ఆ శాఖ  చీఫ్ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌ కృపాకర్ రెడ్డిని ఫోన్ ద్వారా ఆదేశించారు.  

వేసవిలో తాగునీటి సమస్య రానివ్వొద్దు

వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటి రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మున్సిపాలిటీలో నిర్వహించిన రివ్యూలో మాట్లాడుతూ.. 25 ఏండ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదని,  మూడు నెలల పాటు నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. ఈ మేరకు అధికారులు, కౌన్సిలర్లు బాధ్యత తీసుకోవాలన్నారు.

కర్నాటక నుంచి  తెలంగాణకు తాగునీటిని తీసుకువచ్చేందుకు సీఎం రేవంత్​రెడ్డి ఆధ్వర్యంలో త్వరలోనే ఆ రాష్ట్ర సీఎం కలవనున్నట్లు తెలిపారు.  రూ. 600 కోట్లతో చేపట్టనున్న ఔటర్‌‌‌‌‌‌‌‌ రింగ్ రోడ్డు పనులకు వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామని, 6 లేన్ల ఫ్లై ఓవర్ పనులను ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు.  అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌‌‌‌లో మున్సిపల్​ కార్మికులతో కలిసి  సహపంక్తి భోజనం చేశారు.

కలెక్టర్ హరిచందన, అడిషనల్‌‌‌‌ కలెక్టర్ జే. శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్,  డీఆర్‌‌‌‌‌‌‌‌వో రాజ్యలక్ష్మి, ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌బీ, భగీరథ, ట్రాన్స్‌ కో ఎస్‌ఈలు రాజేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్లు,  చంద్రమోహన్, ఆర్డీవో రవికుమార్, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ పాల్గొన్నారు .