
హైదరాబాద్, వెలుగు: మంత్రి కొండా సురేఖ గురువారం స్వల్ప అస్వస్థత గురయ్యారు. మంత్రివర్గ సమావేశం కోసం సెక్రటేరియెట్‌కు వచ్చిన మంత్రి సురేఖ.. తన చాంబర్లోనే స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత కోలుకున్నారు.
విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి కొండా సురేఖ చాంబర్‌కు వెళ్లి ఆమెను పరామర్శించారు. ఆరోగ్యపరిస్థితిపై వైద్యులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒకటి, రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సీఎంకు చెప్పగా..ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలని, ఇంటికి వెళ్లి రెస్టు తీసుకోవాలని మంత్రి సురేఖకు సీఎం సూచించారు.