మేడారం జాతర ఏర్పాట్లపై సర్కార్ ప్రత్యేక దృష్టి : మంత్రి కొండా సురేఖ

మేడారం జాతర ఏర్పాట్లపై  సర్కార్ ప్రత్యేక దృష్టి : మంత్రి కొండా సురేఖ
  • మంత్రి కొండా సురేఖ 

హైద‌‌రాబాద్, వెలుగు: మేడారం జాతర ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి కొండా సురేఖ అన్నారు. భక్తుల భద్రతకు పెద్దపీట వేసేలా జాత‌‌ర‌‌కు ముందు నుంచేప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. 

మేడారం జాత‌‌రలో అమ్మవారి గద్దెల చుట్టూ భ‌‌క్తులు క్యూలైన్లలో సాఫీగా వెళ్లేలా రూపుదిద్దుకుంటున్న బ్రాస్ గ్రిల్స్ నమూనాను శనివారం సెక్రటేరియెట్​లో ఆమె పరిశీలించారు. ఆల‌‌య నిర్వాహ‌‌కుల‌‌తో మాట్లాడారు. బ్రాస్ గ్రిల్స్ నాణ్యమైనవి ఏర్పాటు చేయాల‌‌ని సూచించారు. 

దాదాపు 200 ఏండ్లు మ‌‌న్నికగా ఉండేలా ఈ గ్రిల్స్ ను త‌‌యారు చేయిస్తున్నట్టు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచ‌‌న మేర‌‌కు మేడారంలో శాశ్వత ప‌‌నులు చేస్తున్నామ‌‌ని పేర్కొన్నారు.