
కాశీబుగ్గ/ వరంగల్ సిటీ, వెలుగు: ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ర్ట ప్రభుత్వం పని చేస్తుందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం సిటీలోని 27వ డివిజన్లోని కృష్ణకాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్కాలేజీ భవన నిర్మాణానికి మంత్రి బల్దియా మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్ సత్య శారదతో కలిసి భూమిపూజ చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎస్ఆర్ నిధులు రూ.5 కోట్లతో పాటు అరబిందో ఫార్మా కంపెనీ వారి సహకారంతో ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ భవనం నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు చింతాకుల అనీల్ కుమార్, కావేటి కవిత, బస్వరాజు కుమార్, సురేశ్ జోషి, అరబిందో ఫార్మా డైరెక్టర్ సందానందం రెడ్డి, డీఈవో జ్ఞానేశ్వర్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శ్రీధర్సుమన్, కాలేజ్ ప్రిన్సిపల్ శరధృతి పాల్గొన్నారు.