కేటీఆర్‌కు తల్లి, అక్క, చెల్లి లేరా : మంత్రి కొండా సురేఖ

కేటీఆర్‌కు తల్లి, అక్క, చెల్లి లేరా : మంత్రి కొండా సురేఖ

బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో అనేక మంది సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని ఆమె అన్నారు. కేటీఆర్ కు తల్లి అక్క, చెల్లి లేరా అని ఆమె ప్రశ్నించారు. బాపూఘాట్ లో గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. ‘కేటీఆర్ మాదిరిగానే అందరూ ఉంటారని అనుకుంటున్నారు. మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టమని కేటీఆర్ తన టీమ్‌కు చెప్పారు. గతంలో గిరిగిన మహిళా మంత్రి అయిన సీతక్క, మేయర్ విజయలక్ష్మి మీద కూడా అసభ్యకరంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా పోస్టులు పెట్టింది. ఇప్పుడు బీసీ మహిళైన తనని కూడా కించపరుస్తూ పోస్టులుపెట్టడం బాధాకరం’ అని ఆమె అన్నారు.

ALSO READ | బాపూ ఘాట్‌లో మహాత్మాగాంధీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళి

ఐదేళ్లు భారాసలో పని చేశా.. నా వ్యక్తిత్వం అందరికీ తెలుసని మంత్రి సురేఖా మీడియాతో చెప్పారు. ఆమె ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశాన్ని స్వాగతించారు. అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వాళ్లపై ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తి చూపాలి. అంతేకాని ఇలా.. అసభ్యకరంగా పోస్టులు పెడితే రాజకీయ విలువలు దిగజారిపోతాయి. బీఆర్ఎస్ సోషల్ మీడియా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే అసభ్యకరమైన పోస్టులు వస్తే ఊరుకునేలేదని కొండ సురేఖ వార్నింగ్ ఇచ్చారు.