బాపూ ఘాట్‌లో మహాత్మాగాంధీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళి

బాపూ ఘాట్‌లో మహాత్మాగాంధీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళి

హైదరాబాద్: గాంధీ జయంతిని పురస్కరించుకొని లంగర్ హౌస్ లోని మహాత్మాగాంధీ సమాధి బాపు ఘాట్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సిఎస్ శాంతి కుమారి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణరావు మహాత్మా గాంధీ సమాధి దగ్గర పుష్పాలు ఉంచి ఆయన సేవలు, పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. బాపు ఘాట్ దగ్గర సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.

ALSO READ | బాపు ఘాట్‌లో నివాళులు అర్పించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ