సోనుసూద్‌కు మద్దతుగా మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

సోనుసూద్‌కు మద్దతుగా మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

టీసిగ్ ఆధ్వర్యంలో కోవిడ్ వారియర్లను సన్మానించారు. హైదరాబాద్‌లో జరిగిని ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, సినీ నటుడు సోను సూద్ హాజరయ్యారు. కోవిడ్  సమయంలో ప్రజలకు సేవ చేసిన పలు సంస్థలకు అవార్డులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సోను సూద్ మాట్లాడుతూ.. ఒక్క తెలంగాణ నుంచే ప్రతిస్పందించే వ్యవస్థ తనకు తారస పడిందన్నారు. ఎవరైనా సాయం చేయడానికి ముందుకు వస్తే.. వారిపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఏదో ఆశించి ఇలాంటివన్ని చేస్తున్నారంటూ వారిపై విమర్శలు చేస్తున్నారన్నారు. దీంతో కొందరు అక్కడే ఆగిపోతున్నారన్నారు. అయితే ఇదే సమయంలో మరికొందరు మాత్రం ఇవేం పట్టించుకోకుండా సేవ చేసే విషయంలో ముందుకు వెళ్తున్నారన్నారు. మనం నడిచే బాటలో ఎలాంటి అడ్డంకులు వచ్చినా వాటిన అధిగమిస్తూ.. ముందుకు వెళ్లాలన్నారు. అక్కడే ఆగిపోకూడదన్నారు సోను సూద్.

 మరోవైపు మంత్రి కేటీఆర్ సోనుసూద్‌కు మద్దతుగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనూసూద్ నిజమైన హీరో అన్నారు కేటీఆర్. సోనూసూద్ కోవిడ్ విపత్తు వేళా అద్భుతంగా పనిచేసారని కొనియాడారు. కోవిడ్ 19 మానవత్వానికే ఒక ఛాలెంజ్ విసిరిందన్నారు. ప్రభుత్వాన్ని విమర్శలు చేయడం చాల తేలికన్నారు పనిచేయడం మాత్రం కష్టమన్నారు మంత్రి. కానీ కోవిడ్ 19 వేళా చాలామంది ఆ ప్రయత్నం చేసారన్నారు. వారందరికి అభినందనలు తెలిపారు మంత్రి కేటీఆర్. సోనూసూద్ ప్రజలకు సేవచేసే సమయంలో ఐటీ, ఈడీ దాడులు చేసి ఇబ్బందులు పెట్టె ప్రయత్నం చేసారన్నారు. రాజకీయాల్లోకి వస్తాడనే భయంతోనే ఆయనపై దుష్ప్రచారాం చేశారని వమర్శించారు. సోనూసూద్ తో కలిసి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి. సోను సూద్ వెంట తాము ఉంటామన్నారు.