ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ తెలంగాణకి రాబోతుంది

ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ తెలంగాణకి రాబోతుంది

ఇబ్రహీంపట్నం: కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ టాక్స్ తగ్గించిన తర్వాత చాలా కంపెనీలు తెలంగాణ రాష్ట్రానికి రావడానికి ఆసక్తి చూపిస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని మంగళపల్లిలో ఆన్ కాన్ గ్రూప్, HMDA భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన లాజిస్టిక్ పార్క్ ని మంత్రి ప్రారంభించారు. రెండున్నర లక్షల స్క్వేర్ ఫీట్ల లో ఏర్పాటు చేసిన ఈ పార్క్.. తెలంగాణ లో మొదటి ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్క్ గా నిలవనుందని ఆయన అన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని బాట సింగారం లో త్వరలో మరో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు కానుందన్నారు. ఎలిమినేడు లో 6 వందల ఎకరాల్లో ఏరోస్పెస్ పార్క్ ఏర్పాటు చేయనున్నామని, అదిభట్ల కి మరిన్ని ఐటీ కంపెనీలు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ముచ్చర్ల లో రాబోతుందన్నారు. ఫార్మా సీటీ వల్ల చుట్టుపక్కల గ్రామాలకు ఎలాంటి కాలుష్యం ఉండదని, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మరో 8 లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈదుల నాగుల పల్లి, చర్లపల్లి లో రైల్వే టెర్మినల్స్ రాబోతున్నాయని, ఆన్ కాన్ లాజిస్టిక్ పార్క్ ద్వారా వెయ్యి మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని అన్నారు. ఇబ్రహీంపట్నం లోని నాలుగు మున్సిపాలిటీలల్లో డ్రైనేజి వ్యవస్థ బాగుపర్చడం కోసం 40 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు కేటీఆర్.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ లో ఏ కార్యక్రమం చేసినా దేశమంతా కేసీఆర్ వైపు చూస్తుందన్నారు. హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి కేటీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారని చెప్పారు. టీఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులతో పాటు ఉద్యోగాలు కూడా వచ్చాయన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న 5 మున్సిపాలిటీలకు అధిక నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ ని కోరుతున్నానని ఆమె ఈ సందర్భంగా అన్నారు.

 

minister-ktr-inaugurated-logistic-park-in-ibrahimpatnam
minister-ktr-inaugurated-logistic-park-in-ibrahimpatnam
minister-ktr-inaugurated-logistic-park-in-ibrahimpatnam