చందన్ వెల్లి అతిపెద్ద పారిశ్రామిక వాడ కాబోతోంది: కేటీఆర్

చందన్ వెల్లి అతిపెద్ద పారిశ్రామిక వాడ కాబోతోంది: కేటీఆర్

పాలమూరు ప్రాజెక్టు నీళ్లు త్వరలోనే రంగారెడ్డి జిల్లాకు అందబోతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికే పాలమూరు పూర్తి అయ్యేదని.. కానీ కోర్టు కేసుల వల్ల ఆలస్యం అయిందని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి అవుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా చందన్ వెల్లి కాబోతోందని ఆయన కొనియాడారు. భవిష్యత్ తరాలకు పరిశ్రమలే ఉపాధి అన్నారు.  చందన్ వెల్లి పారిశ్రామిక వాడలో వెల్ స్పన్ అడ్వాన్స్ డ్ మెటీరియల్ లిమిటెడ్ యూనిట్‭ను మంత్రి ప్రారంభించారు. 

గుజరాత్ నుంచి వచ్చి వెల్ స్పన్ ఇక్కడ భారీ పెట్టుబడులు పెట్టడం గర్వంగా ఉందని కేటీఆర్ చెప్పారు. రాబోయే ఐదారేళ్లలో వెల్ స్పన్ అధినేత బాలకృష్ణ గోయెంక తెలంగాణలో రూ.3వేల కోట్లకు పైగా.. పెట్టుబడులు పెట్టాలనుకోవడాన్ని మంత్రి స్వాగతించారు. పరిశ్రమలు ఎంత ఎక్కువగా వస్తే యువతకు అంత ఉపాధి దొరుకుతుందని ఆయన పేర్కొన్నారు. స్థానిక మహిళలను భాగస్వామ్యుల్ని చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్‌స్పన్ ప్రతినిధులు చెప్పడం సంతోషకరమని కేటీఆర్ అన్నారు.