పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తోంది.. : కేటీఆర్

పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తోంది.. : కేటీఆర్

రాష్ట్రంలో అన్ని రకాల పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు.  కస్టమర్‌ కేర్‌ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌, వీఎక్స్‌ సొల్యూషన్స్‌ సంస్థ ఆఫీసును మంత్రి కేటీఆర్​ మాదాపూర్​లో ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్లోబల్​ సంస్థ అయిన వీఎక్స్​లోకల్​ ప్రమాణాలు ఫాలో అవుతుండటం గొప్ప విషయం అని అలాంటి ప్రతి సంస్థకు తమ మద్దతు ఉంటుందని అన్నారు. దేశ వ్యాప్తంగా ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోందని వివరించారు. 

కంపెనీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సరళతర విధానాలే పెట్టుబడుల ఆకర్షణకు ప్రధాన కారణమవుతున్నాయని చెప్పారు.