
హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పరిశ్రమలు విస్తరించాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఆయన పటాన్ చెరులో ఐడిఏ పాశమైలారం పారిశ్రామిక వాడలోని " ఆల్ ప్లా మౌల్డ్ షాప్, డ్యూయెల్ ఎడ్యుకేషన్" సెంటర్ ను ప్రారంభించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిశ్రమల వికేంద్రీకరణ జరుగుతోందన్నారు. హైదరాబాద్ లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న సంగారెడ్డి, మేడ్చల్ లో పరిశ్రమల్ని నెలకొల్పుతున్నామన్నారు. తెలంగాణలో సస్య విప్లవం కొనసాగుతోందని.. ఈ మేరకు ఐదు రకాల ఉత్పత్తులపై ప్రభుత్వం దృష్టి సారించిందని కేటీఆర్ తెలిపారు. ఆహార శుద్ది కేంద్రాలు రాష్ట్రం అంతటా విస్థరించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.
10 వేల ఎకరాల్లో ఆగ్రో ఆధారిత ఫుడ్ ప్రాసెస్ యూనిట్లు స్థాపన జరగబోతోందని కేటీఆర్ తెలిపారు. అలాగే చేపల ఉత్పత్తిలో తెలంగాణ ఘననీయమైన ప్రగతిని సాధిస్తోందని అన్నారు. అమెరికా నుండి వచ్చి ఇక్కడ చేపల ఉత్పత్తి కోసం వెయ్యి కోట్లతో పెట్టుబడులు పెట్టనున్నారని వెల్లడించారు. న్యూజిలాండ్ లో ఎనిమిది శాతం జీడీపీ పాల ఉత్పత్తుల ద్వారానే వస్తోంది. కాబట్టి ఆ స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం పంటలతో పాటు, పాడిని కూడా పెంచడానికి కృషి చేస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టే పెట్టుబడుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని కేటీఆర్ తెలిపారు, దాంతో మరింత మంది పెట్టుబడుదారులు ఇక్కడ పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. ఆల్ ప్లా కంపెనీ స్థానిక యువతకు వృత్తి నైపుణ్యాలు కల్పిస్తూ, ఉపాధి కల్పించడం హర్షనీయం అన్నారు. త్వరలో పటాన్ చెరులోని శివా నగర్ లో ఎల్ఇడి బల్బ్ కంపెనీని ప్రారంభించబోతున్నామని తెలిపారు. దిగుమతులు తగ్గి స్థానికంగానే అనేక ఉత్పత్తులు పెరిగి యువతకు ఉపాధి పెరిగేలా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో మీట్ ప్రాసెసింగ్ రావాలని కేటీఆర్ అన్నారు. మీట్ ఇండస్ట్రీలో భారత దేశానికి కాకుండా ఇతర దేశాలకు కూడా మాసం ఎగుమతి చేసే స్థాయికి రావాలన్నారు. రాష్ట్రంలో గొర్రెల పెంపకం ఎక్కువగా చేపట్టాలని సూచించారు. ఈమేరకు గొల్ల, కురుమ సోదరులకు గొర్లు పంపిణీ చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో మూతపడే దిశకు చేరిన విజయ డైరీని ఈ రోజు అభివృద్ధి రంగంలో నడిపించామని కేటీఆర్ పేర్కొన్నారు.