పెట్టుబడులకు కేరాఫ్​ తెలంగాణ.. : కేటీఆర్​

పెట్టుబడులకు కేరాఫ్​ తెలంగాణ.. : కేటీఆర్​

కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ కేరాఫ్ గా మారిందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు.  తెలంగాణలో ఫుడ్​ప్రాసెసింగ్, ఎక్స్​ పోర్ట్​ రిటైల్​ రంగంలో పెట్టుబడి పెట్టడానికి అంతర్జాతీయ సంస్థ లులూ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా బేగంపేటలోని ఐటీసీ కాకతీయ  హోటల్లో మంత్రి కేటీఆర్​ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో కంపెనీ చేపట్టబోయే పనులను వివరించనుంది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ర్టం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిదని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి సంస్థ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం సంతోషంగా ఉందని తెలిపారు.  పరిశ్రమల స్థాపనతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తున్నాయని వెల్లడించారు. లులూ గ్రూప్​ ఛైర్మన్​ యూసఫ్​ అలీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రూ.3,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వివరించారు. దావోస్​ లో చేసుకున్న ఒప్పందం మేరకు కంపెనీ విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నట్లు వివరించారు.