
సబ్ కా వికాస్ కాదు..సబ్ కా వినాశ్ అని మంత్రి కేటీఆర్ అన్నారు.కాళేశ్వరంలో అవినీతి లేదని కేంద్రమంత్రే చెప్పారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నయాపైసా ఇవ్వలేదన్నారు. ఎన్డీయేలో బీజేపీతో పాటు సీబీఐ,ఎన్ఐఏ,ఈడీలున్నాయన్నారు.2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న హామీ ఏమైందన్నారు .2022 కల్లా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తానన్నారని..ఎన్ని రాష్ట్రాల్లో ఇచ్చారన్నారు. యూపీలో గుండాగిరి లేకుండా చేశామని ఓట్లు అడుగుతున్నారన్నారు. మోడీ అంటే రైతు విరోధి అని అన్నారు. యూపీలో చేసింది చెప్పుకుని ఓట్లు అడిగే ప్రసక్తి లేదన్నారు. మీడియాను మోడియాగా మార్చారన్నారు. రైతుల నిరసనలతో పంజాబ్ లో వెనక్కి వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. బీజేపీ చేసింది ఏమీ లేదని..గుండుసున్నా అని అన్నారు. చెప్పుకునేందకు మోడీ ప్రభుత్వం అర పైస పనికూడా చేయలేదన్నారు. కేంద్రంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. దేశంలో ఇంటింటికి రైలు. బుల్లెట్ రైలు హామీ ఏమైందన్నారు కేటీఆర్..