ఈటల మాతో ఉన్నప్పుడు మంచిగుండే: కేటీఆర్

ఈటల మాతో ఉన్నప్పుడు మంచిగుండే: కేటీఆర్

24 గంటల కరెంట్ ఎక్కడిస్తున్నారో చెప్పాలన్న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రసంగం సందర్భంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఈటల రాజేందర్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మంచిగా ఉండేవాడని, కానీ బీజేపీలోకి వెళ్లాక ఆయనలో మార్పు వచ్చిందని అన్నారు. కమలం పార్టీలోకి వెళ్లాక మనుషులు మారిపోతారని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ రాక ముందు కరెంట్ ఎలా ఉండేదో వచ్చాక ఎలా ఉంటుందో ప్రజలకు తెలుసన్నారు. అప్పట్లో పవర్ హాలిడేస్ ఉంటే.. ఇప్పుడు పవర్ ఫుల్ డేస్ అని చెప్పారు. 

రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు ఎందుకు పెట్టాలని కేంద్రాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. మోటార్లుకు మీటర్లు పెట్టాలని రాష్ట్రానికి కేంద్రం లేఖ రాసిందని.. అయితే మీటర్లు పెట్టమని స్పష్టం చేశామని చెప్పారు. కేసీఆర్ ఉన్నంతకాలం రాష్ట్రంలో కేంద్రం పప్పులుడకవన్నారు. విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందన్న కేటీఆర్ గుజరాత్లో విద్యుత్, నీటి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఊపర్ షేర్వానీ అందర్ పరేషానీ అన్నట్లుగా గుజరాత్లో పాలన ఉందని విమర్శించారు.