కేసీఆర్ కు కుల, మత గజ్జీ లేదు : కేటీఆర్

కేసీఆర్ కు కుల, మత గజ్జీ లేదు : కేటీఆర్

రెండోరోజు వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు  ప్రారంభమయ్యాయి.   ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది.  ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.  2022-23 లో ఐటీ ఎగుమతులు 31.4 శాతం పెరిగాయన్నారు.  ప్రముఖ ఐటీ కంపెనీలు హైదరాబాద్ కు వచ్చాయని చెప్పారు.  తెలంగాణ వచ్చాక కొత్తగా 6 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. తెలంగాణలో దక్షత,దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ కు కుల, మత గజ్జీ లేదని.. దమ్మున్న నాయకుడు కేసీఆర్  సీఎంగా ఉండడమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని అన్నారు. 

అకాల వర్షాలు, వరద సహాయంపై శాసనసభలో, గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై మండలిలో వాయిదా తీర్మాణాలు ఇచ్చింది కాంగ్రెస్.  మరి కాసేపట్లో  విద్య, వైద్యం, వరదలపై అసెంబ్లీలో చర్చించనున్నారు సభ్యులు. మెడికల్ ప్రొఫెసర్లతో పాటు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ల రిటైర్మెంట్ వయసు 65 ఏండ్లకు పెంచే బిల్లును మరోసారి సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఆర్టీసీ విలీనంతో పాటు మరో 9 బిల్లులు సభలో ప్రశపెట్టనుంది.