‘మిషన్ భగీరథ’కు అవార్డు సరే.. నిధులూ ఇవ్వండి

‘మిషన్ భగీరథ’కు అవార్డు సరే.. నిధులూ ఇవ్వండి

‘మిషన్ భగీరథ’ పథకానికి జాతీయ అవార్డును ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సురక్షితమైన తాగునీటిని  అందించేందుకు అమలుచేస్తున్న ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని అవార్డుకు ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ‘మిషన్ భగీరథ’కు రూ.19,000 కోట్ల గ్రాంట్ ను కేటాయించాలని నీతి ఆయోగ్ చేసిన సిఫారసుకు కూడా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదం తెలిపితే మరింత బాగుంటుందని సూచించారు. ఈమేరకు వ్యాఖ్యలతో ఆయన ట్వీట్ చేశారు. 

తాగునీటి రంగంలో అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలు, అమలు తీరు, నిర్వహణ వంటి అంశాలన్నీ బేరీజు వేసుకున్న తర్వాతే తెలంగాణ నుంచి మిషన్ భగీరథ పథకాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. అక్టోబరు 2న జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున ఢిల్లీలో ఈ అవార్డులను రాష్ట్రాలకు ప్రదానం చేయనున్నారు. ఈమేరకు కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానం కూడా అందింది.