ఆత్మ నిర్భర్ భారత్ సహాయ ప్యాకేజీని రీ డిఫైన్ చేయండి

ఆత్మ నిర్భర్ భారత్ సహాయ ప్యాకేజీని రీ డిఫైన్ చేయండి

కరోనా సంక్షోభంలో వివిధ రంగాలను ఆదుకునేందుకు ప్రధాని మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర్ భారత్ సహాయ ప్యాకేజీని రీ డిఫైన్ చేయాలన్నారు మంత్రి కేటీఆర్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలోని 80 శాతం MSMEలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు మంత్రి కేటీఆర్. 25 శాతానికి పైగా MSMEలు పూర్తిగా ఆదాయం కోల్పోయాయన్నారు. ఆత్మ నిర్భర్ ప్యాకేజీ ద్వారా MSMEలకు లబ్ధి చేకూర్చేందుకు గట్టి ప్రయత్నం చేశానని చెప్పారు. ఐతే ప్యాకేజీలో MSMEలకు మేలు చేసే అంశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు కేటీఆర్. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ స్కీం కోసం మూడు లక్షల కోట్లు కేటాయించారని...కానీ గైడ్ లైన్స్ విడుదలయ్యాక వీటితో పెద్ద ప్రయోజనం లేదని తెలంగాణలోని MSMEలు భావిస్తున్నాయన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందెందుకు సంక్లిష్టమైన ప్రక్రియ రూపొందించారని లేఖలో పేర్కొన్నారు KTR. నష్టాలను పూడ్చేలా భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలన్నారు.