
1955లోనే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడిందన్నారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. అసెంబ్లీలో GHMC చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం గత ప్రభుత్వాలు ఎలాంటి ఆలోచన చేయలేదన్నారు. హైదరాబాద్ మహానగరం శర వేగంగా విశ్వనగరంగా ఎదుగుతుందన్నారు. మహిళ సాధికారతకు TRS సర్కార్ పెద్దపీట వేస్తుందన్న కేటీఆర్..GHMCలో మహిళలకు 50 శాతం స్థానాలు కల్పించేలా సవరణకు ప్రతిపాదించారు. పచ్చదనాన్ని పెంచేందుకు 2.5 శాతంగా ఉన్న బడ్జెట్ ను 10 శాతానికి పెంచేలా కేటీఆర్ సవరణలు ప్రతిపాదించారు.