ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు పెద్దపీట : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

 ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు పెద్దపీట : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల టౌన్, వెలుగు: రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం జగిత్యాల కలెక్టరేట్‌‌‌‌లో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా పట్టణంలోని 938 స్వయం సహాయక మహిళా సంఘాలకు 2.98కోట్ల చెక్కును ఎమ్మెల్యే సంజయ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, కలెక్టర్ సత్యప్రసాద్‌‌‌‌తో కలిసి  అందజేశారు.

మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి మహిళలకు ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సోలార్ ప్లాంట్లు, వడ్డీ లేని రుణాలు, అద్దె బస్సులు, యూనిఫామ్‌‌‌‌లు అందిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ మెప్మా ఆధ్వర్యంలో అత్యధిక రుణాలు అందించి మహిళలు స్వయం ఉపాధి కల్పించాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లత, అధికారులు పాల్గొన్నారు.