మంత్రి మహేందర్​రెడ్డికి జర్నలిస్టుల వినతి

మంత్రి మహేందర్​రెడ్డికి జర్నలిస్టుల వినతి
  •     మంత్రి మహేందర్​రెడ్డికి జర్నలిస్టుల వినతి

హైదరాబాద్, వెలుగు :  హైదరాబాద్​లో పని చేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల  స్థలాలు ఇవ్వాలని మంత్రి మహేందర్​రెడ్డికి ‘ది తెలంగాణ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. సొసైటీ  తరఫున జర్నలిస్టుల బృందం శనివారం మంత్రితో పాటు సీఎస్ ​శాంతి కుమారిని కలిశారు.

హైదరాబాద్​ కేంద్రంగా పని చేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించాలని కోరారు. ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని వారు హామీ ఇచ్చారన్నారు.