సిటీలో 30వేలకు పైగా వినాయక మండపాలు

సిటీలో  30వేలకు పైగా వినాయక మండపాలు

సీఎం కేసీఆర్ త్వరలో పీఎం అవుతారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సికింద్రాబాద్ లోని సిద్ధి వినాయక  టెంపుల్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరిగాయి. మంత్రి మల్లారెడ్డి,  తలసాని శ్రీనివాస్ యాదవ్  వినాయకుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మల్లారెడ్డి.. తెలంగాణ లాగే దేశంలో అన్ని రాష్ట్రాలను కేసీఆర్ డెవ్ లప్ చేస్తారన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేశారన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను కేసీఆర్ తీసుకొచ్చారన్నారు. కేంద్రంలో బీజేపీ ట్యాక్స్ లు పెంచడం తప్ప ఏం చేయలేదన్నారు.

సిటీలో ఈ సారి 30 వేలకు పైగా వినాయక మండపాలు ఏర్పాటయ్యాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వినాయక చవితికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసిందన్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పీసీబీ కలిసి సిటీలో 6లక్షల మట్టి విగ్రహాలు పంపిణీ చేశామన్నారు.  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జనం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు .అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ పండగ చేసుకోవాలని  సూచించారు.