బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రి చర్చలు

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రి చర్చలు

సమస్యలను పరిష్కరించాలంటూ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వారం రోజులుగా చేస్తున్న ఆందోళనలపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు  దిగి వచ్చింది.  విద్యార్థులతో నేరుగా చర్చించేందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం రాత్రి బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు వచ్చారు. ఈసందర్భంగా విద్యార్థులతో చర్చలు నిర్వహించారు. వారి డిమాండ్లను మంత్రి అడిగి తెలుసుకున్నారు. డిమాండ్ల పరిష్కారంలో సాధ్యాసాధ్యాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. చర్చలు జరిగే చోట భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. కాగా, అంతకుముందు సోమవారం ఉదయం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థులందరూ ఆందోళనలు విరమించి.. క్లాసులకు హాజరయ్యే పరిష్కార మార్గాలపై చర్చించారు. విద్యార్థులకు ట్యాబ్‌లు, యూనిఫామ్ లు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ వెంకటరమణ.. బాసర ట్రిపుల్ ఐటీకి నిధులు మంజూరు చేసే విషయంపై నివేదికను తయారు చేసి మంత్రికి అందజేసినట్లు సమాచారం.