వాణిజ్య పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి

వాణిజ్య పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి

దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నల్గొండలో వానాకాలం పంటలసాగుపై నిర్వహించిన అధికారులు, రైతుసమితి సభ్యులకు నిర్వహించిన వర్క్ షాప్లో మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో వ్యవసాయ రంగం అద్భుతంగా అభివృద్ధి చెందిందన్నారు. బీడు భూములు సైతం సాగులోకివచ్చినట్లు తెలిపారు. ఒకే రకమైన పంటలు పండించకుండా వాణిజ్యపంటలు పండించేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తుందని నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఆ పార్టీ నేతలు ప్రజలకు మేలు చేయాల్సింది పోయి కీడు చేస్తుందని మండిపడ్డారు. డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ కొత్త డ్రామాకు తెరలేపిందన్న మంత్రి...బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతుల పాలిట అతి ప్రమాదకరంగా మారాయని అన్నారు. 

రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే సీఎం లక్ష్యం - జగదీష్ రెడ్డి

అధునాతన వ్యవసాయ విధానాల్లో రైతులు ముందుండాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. రైతులకు అండగా మేముంటామని చెప్పారు. సాగునీరు, కరెంటు విషయంలో రైతులకు ఎటువంటి డోకా లేకుండా చేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చిట్టచివరి భూములకు సైతం నీరందుస్తున్నట్లు తెలిపారు. రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని వెల్లడించారు. ఇక నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టామని మంత్రి తెలిపారు.

మరిన్ని వార్తల కోసం

 

సోనియా, రాహుల్కు ఈడీ నోటీసులు

నిర్మాతలకు ‘కాసుల’ కష్టాలు