మధు యాష్కీని కలిసిన మంత్రి పొంగులేటి, పట్నం మహేందర్ రెడ్డి

మధు యాష్కీని కలిసిన మంత్రి పొంగులేటి, పట్నం మహేందర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఏఐసీసీ అధికార ప్రతినిధి మధు యాష్కీ గౌడ్‌‌‌‌‌‌‌‌ను  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి వేర్వేరుగా కలిశారు. ఆదివారం ఆయన నివాసంలో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఇద్దరు నేతలతో మధు యాష్కీ కాసేపు ముచ్చటించారు. ప్రధానంగా పట్నం మహేందర్ రెడ్డితో  మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరి లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల ప్రచారంపై చర్చించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరి పార్లమెంట్ పరిధిలోని ఎల్‌‌‌‌‌‌‌‌బీనగర్ నుంచి మధు యాష్కీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయం తెలిసిందే.