ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ నెలాఖరులోగా ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతగా 3500 ఇళ్ల నుంచి 4 వేల ఇళ్ల వరకు ఇస్తామన్నారు. గోషామహల్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన పొంగులేటి.. రానున్న నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పింకు చొక్కాలు, మూడు రంగుల జెండాతో సంబంధం లేకుండా పేదలకు ఇళ్లు కేటాయిస్తామన్నారు.
దశాబ్దాల కొద్ది మూసీలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు పొంగులేటి. మూసీ బెడ్ లో నివసించే వారికి మంచి జీవితం ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. దీన్ని కూడా ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నారని తెలిపారు. గత పదేళ్ళలో వాళ్ళు చేయలేని పనులు తాము చేస్తుంటే... బీఆర్ఎస్ చిల్లర వేషాలు వేస్తుందని విమర్శించారు.పెయిడ్ ఆర్టిస్తులను తీసుకొచ్చి యూట్యూబ్ ల ద్వారా దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు పొంగులేటి.
Also Read : కేటీఆర్,హరీశ్ అక్రమాలు తేలుస్తాం
మూసీలో ఉన్నవారికి అన్ని వసతులతో ఇళ్లు, జీవనోపాధి కల్పిస్తున్నామని చెప్పారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మూసీలో ఉండే పిల్లలను వారికి నచ్చిన స్కూల్స్ లో అడ్మిషన్ ఇప్పిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటాను తెచ్చుకోవడంలో విఫలమైందన్నారు పొంగులేటి.