మీ చరిత్ర అంతా బయటికి తీస్తాం:మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మీ చరిత్ర అంతా బయటికి తీస్తాం:మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పై అసెంబ్లీలో వాడీ వేడీ చర్చ జరిగింది. ఆదివారం (ఆగస్టు 31) సాయంత్రం ఘోష్ కమిషన్ పై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య  మాటల  తూటాలు పేలాయి. తుమ్మడిహట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టును మేడగడ్డకు ఎందుకు తరలించాల్సి వచ్చిందని  మంత్రి పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి  ప్రశ్నించారు.  

తుమ్మడిహట్టిని పక్కనబెట్టి మేడిగడ్డ వద్ద ప్రాజెక్టును నిర్మించారు..కమిషన్ల కోసమే గత బీఆర్ ఎస్ ప్రభుత్వం చేసిందని పొంగులేటి అన్నారు. రూ.6వేల 100 కోట్లు ఖర్చు పెట్టాకకూడా ఎందుకు పక్కన పెట్టారు..రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు ఎందుకు మార్చారు..అంత హడావుడిగా ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం ఏం వచ్చిందని పొంగులేటి అన్నారు.నిపుణుల కమిటీ సూచనలు పక్కన బెట్టి మేడిగడ్డ ప్రాజెక్టు కట్టారని..మీకు కావాల్సింది రాదనే కదా మేడిగట్టకు మార్చారన్నారు. లక్ష కోట్లు దోచే ఉద్దేశంతోనే కాళేశ్వరం కట్టారని హరీష్ రావుపై పొంగులేటి ఫైర్ అయ్యారు. 

మరోవైపు తుమ్మిడి హట్టి దగ్గర నీళ్లుండగా ప్రాజెక్టును మేడిగడ్డ  దగ్గర ఎందుకు కట్టారని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. తుమ్మడిహట్టి దగ్గర ఉన్న నీళ్లే మేడిగడ్డ దగ్గర ఉన్నాయి.. ఏ ఉపనది లేకుండా అదనపు నీళ్లు ఎలా వచ్చాయి.. ప్రాణహిత  తర్వాత మేడిగడ్డకు  ఏ ఉపనది వచ్చిందో చెప్పాలని ..అదనంగా మీరు సాధించింది ఏమిటీ అన్నారు మంత్రి జూపల్లి.