పేదలకు ఇందిరమ్మ ఇండ్లు.. అవినీతి జరిగితే సహించను: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పేదలకు  ఇందిరమ్మ ఇండ్లు.. అవినీతి జరిగితే సహించను: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఇందిరమ్మ ఇండ్లలో ఎక్కడ అవినీతి జరిగినా సహించేది లేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు  కేటాయిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు సక్సె కావాలంటే యువ ఇంజినీర్ల పాత్ర కీలకమన్నారు.  ఇందిరమ్మ ఇండ్లకోసం  శిక్షణ పూర్తిచేసుకున్న 390 మందియువ  అసిస్టెంట్ ఇంజ‌నీర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. 

 ఈ సందర్బంగా మాట్లాడిన  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ కార్యకర్తలా? ఇతర పార్టీలా అన్ని పార్టీల వారికి.. అర్హులైన పేదలకే ఇండ్లు  ఇవ్వాలన్నారు.  ఇందిరమ్మ ఇళ్లు పేదవారికి అందాలంటే  అది పేద కుటుంబాల నుంచి వచ్చిన  యువ ఇంజనీర్లకే తెలుసన్నారు.  ఎవరూ ప్రలోభాలు పెట్టినా డబ్బుకు ఆశపడొద్దని హెచ్చరించారు. 600 చదరపు మీటర్లు లోపే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని..ఎక్కు జాగలో ఇళ్లు కడితే తర్వాత వచ్చే డబ్బులు ఇవ్వబోమన్నారు.  

మొత్తం నాలుగు దశల్లో అమౌంట్ రిలీజ్ అవుతుందన్నారు పొంగులేటి. గ్రౌండ్ లెవల్ లో ప్రతి ఇంటిని పరిశీలించే బాధ్యత యువ ఇంజనీర్లదేనన్నారు.   ప్రతి సోమవారం అర్హులకు ఇందిరమ్మ ఇండ్ల నిధులు రిలీజ్ చేస్తామన్నారు.  డబ్బులు రిలీజ్ చేశాక ప్రతి ఇంటిని పరిశీలిస్తామని చెప్పారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి