
హైదరాబాద్: సచివాలయంలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. రెవెన్యూ శాఖలో 11.45 గంటల వరకు పూర్తి స్థాయిలో ఉద్యోగులు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా హాజరు పట్టికలను పరిశీలించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.