- ఐటీ దారులు ఆందోళన పడొద్దు
- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
వనపర్తి: రైతును రాజును చేయాలన్నదే సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇవాళ వనపర్తిలో నిర్వహించిన పంట పెట్టుబడి పథకం రైతు భరోసాపై నిర్వహించిన సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదసస్సులో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గతంలో నాలుగు గోడల మధ్య కూర్చొని నిర్ణయాలు తీసుకుకున్నారని అన్నారు.
కొండలు, గుట్టలు, భూస్వాములు, లేఔట్, ఫాంహౌస్ లకు రైతుబంధు పెట్టుబడిని ఇచ్చారని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల మధ్యకు పోయి వారి సూచనలను పరిగణనలోకి తీసుకుని రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. 10 ఎకరాల వారికి, ఐటీ రిటర్న్, ఐటీ చెల్లించే వారికి ఇవ్వరని ప్రతిపక్షాలు రైతులను భయపెడుతున్నాయని విమర్శించారు. వారెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. రైతులు, కౌలు రైతులు ఇలా అందరి దగ్గర అన్ని రకాల సూచనలు తీసుకుని రైతులకు అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. రైతు భరోసా పై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజల, రైతు సంఘాల నుంచి మంత్రివర్గ ఉప సంఘం అభిప్రాపయాలు సేకరిస్తుందన్నారు. .
శాసనసభ లో నిర్ణయం తీసుకుంటం: మంత్రుల తుమ్మల నాగేశ్వర రావు
రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తరువాతే నివేదిను శాసనసభ లో ప్రవేశ పెట్టి నిర్ణయం తీసుకుంటామని మంత్రుల తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. కింటాలుకు వెయ్యి నష్టమొచ్చినా పప్పుదినుసుల తో సహా అన్ని పంటలను ఎమ్మెస్పీ ధరకు కొన్నామన్నారు. . ప్రస్తుతానికి అకాలవర్షం, ఇతరత్రా నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ.10వేలు ఇస్తామన్నారు. .
రైతుబంధు ఒక్కసారి కూడా తీసుకోలే: ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
ఇంతవరకు తాను ఒక్కసారి కూడా రైతు బంధు పైసలు తీసుకోలేదని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. తనకు 80 ఎకరాల భూమి ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో 12పర్యాయాలు రైతుబంధు ఇస్తే ఒక్కసారి కూడా తీసుకోలేదన్నారు. గత ప్రభుత్వ హయాం లో రైతుబంధు నిధులు చాలా మటుకు వృథా అయ్యాయన్న అభిప్రాయం అందరిలో ఉందని ఆయన చెప్పారు.
