హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం తెలంగాణ ఉద్యమ కారులతో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మంత్రి పొన్నంను కలిశారు.
ఉద్యమకారులను త్వరలో సీఎం దగ్గరకు తీసుకెళ్లి మీటింగ్ ఏర్పాటుకు , కమిటీ ఏర్పాటుకు చొరవ చూపిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కమిటీకి సంబంధించిన విధి విధానాలు, ఉద్యమకారుల హామీలు తదితర అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్, ఫ్రొపెసర్ కోదండరాం, ఉద్యమకారులు చర్చించారు. ప్రతి నెల పెన్షన్, ఇంటి జాగా, స్మృతి వనం ఏర్పాటు చేయాలని ఉద్యమ కారులు కోరారు.
