
బలహీన వర్గాల నేత కాబట్టే ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను ఆమోదించారని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బండి సంజయ్ ను కారణం లేకుండానే అధ్యక్ష పదవి నుంచి తొలగించి..అగ్ర వర్ణాల వాళ్లను అధ్యక్షులుగా నియమించారని చెప్పారు. బీజేపీ బీసీలకు వ్యతిరేకమని అన్నారు.
ప్రతిపక్ష పార్టీలలో ఉన్న బీసీ నాయకులెవరైనా బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడొద్దని సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎవరి పోరాటం కాదని.. కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేశామని చెప్పారు. దెయ్యాలను రెచ్చకొట్టొద్దని.. బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవొద్దని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే 18 నెలలు వాయిదా పడ్డాయని..అన్ని పార్టీలు సహకరించాలన్నారు. ఉక్కు కవచంగా నిలపడి బీసీ రిజర్వేషన్లను కాపాడుకుంటామని చెప్పారు పొన్నం.
Also Read : బీజేపీది మొసలి కన్నీరు.. బీసీల నోటికాడి కూడును లాగొద్దు
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించిన సంగతి తెలిసిందే. తెలంగాణ బీజేపీలోని పరిణామాలకు నిరసనగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి.. తన రాజీనామా లేఖను బీజేపీ హైకమాండ్ కు పంపించారు. వారం రోజుల తర్వాత రాజాసింగ్ రాజీనామాను ఆమోదించింది బీజేపీ హైకమాండ్. ఈ మేరకు 2025, జూలై 11వ తేదీన బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ అధికారికంగా ప్రకటించారు.