బీజేపీది మొసలి కన్నీరు.. బీసీల నోటికాడి కూడును లాగొద్దు : మంత్రి పొన్నం

బీజేపీది మొసలి కన్నీరు.. బీసీల నోటికాడి కూడును లాగొద్దు : మంత్రి పొన్నం

తెలంగాణ బీసీలపై  బీజేపీ మొసలి కన్నీరు కారుస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ . బీజేపీ తెలంగాణ చీఫ్ పదవి బీసీలకు ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. బీజేపీలో బలమైన బీసీ నాయకులున్నా  హైకమాండ్ పట్టించుకోలేదన్నారు.  బండి సంజయ్ ను కారణం లేకుండానే తొలగించారని చెప్పారు. . ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు  ఛాంపియన్ కాంగ్రెస్సే.. బీజేపీ..బీసీల నోటికాడి కూడును చెడగొట్టొద్దని కోరారు పొన్నం.

చట్ట సభలో ప్రవేశించేదుకు బలమైన వేధిక  స్థానిక సంస్థల ఎన్నికని చెప్పారు మంత్రి పొన్నం. బీసీల42 శాతం రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగుమం చేస్తున్నామన్నారు.  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. బీసీలు రాజకీయంగా ఎదిగేందుకు కాంగ్రెస్ చారిత్రాత్మక నిర్నయం తీసుకుందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ను కాంగ్రెస్ అమలు చేస్తోందన్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇందుకోసం పంచాయతీరాజ్ చట్టం-–2018కి సవరణలు చేయాలని, త్వరలోనే ఆర్డినెన్స్​ జారీ చేయాలని నిర్ణయించింది. సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు మండలం యూనిట్ గా.. ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలకు జిల్లా యూనిట్ గా.. జెడ్పీ చైర్​పర్సన్లకు రాష్ట్రం యూనిట్ గా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. సీఎం రేవంత్​ రెడ్డి అధ్యక్షతన గురువారం సెక్రటేరియెట్​లో మంత్రివర్గ సమావేశం జరిగింది.

ALSO READ : అలాంటి రామచందర్ రావుకి బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవా.?