కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు తెలంగాణ పాలిటిక్స్ లో ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. ఇదిలా ఉండగా... ఈ కేసుకు సంబంధించి విచారణకు సహకరించాలని బండి సంజయ్ సహకరించాలంటూ చేసిన తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కేసులో బాధితురాలికి న్యాయం జరగాలన్నదే తన ఉద్దేశమని అన్నారు పొన్నం ప్రభాకర్.
బండి సంజయ్ విచారణ ఎదుర్కొని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని అన్నానని..కాంగ్రెస్ పార్టీ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందంటూ మున్నూరు కాపు సంఘాలు విమర్శిస్తున్న క్రమంలో.. అమ్మాయిది కూడా అదే సామాజికవర్గమని చెప్పడం జరిగిందని అన్నారు.
బాధితురాలికి న్యాయం చేసే పెళ్లి అనే పదం వాడానని... అమ్మాయికి న్యాయం చేసే విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదని స్పష్టం చేశారు పొన్నం ప్రభాకర్.బాధితురాలికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని.. వారికి పూర్తిగా మద్దతుగా ఉంటామని అన్నారు పొన్నం ప్రభాకర్.బాధితురాలికి న్యాయం జరగాల్సిందేనని.. న్యాయం కోసం పోరాడతామని అన్నారు
