భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని వీరభద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం టెంపుల్ గుట్ట దగ్గర మెట్ల మార్గం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.మాస శివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలు బాగుండాలని విరభద్రుడిని ప్రత్యేక పూజలు చేశానని అన్నారు. ఆ నాడు దీక్షా దివాస్ లో BRS నిరాహార దీక్ష కాడి దింపితే విద్యార్థులు ఎత్తుకున్నారని అన్నారు. తెలంగాణ ఇవ్వాలని సోనియాగాంధీ దృడ నిశ్చయం లేకపోతే రాష్ట్రం వచ్చేదా అన్నది బీఆర్ఎస్ ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు.
Also Read :- నాది పంజాబ్ అయినా.. తెలుగు ప్రజలు నా కుటుంబ సభ్యులు
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పట్ల అన్ని పార్టీలు కృతజ్ఞతతో ఉండాలని అన్నారు.తల్లిని చంపి బిడ్డను ఎత్తుకుపోయారని తెలంగాణ విద్రోహులుగా చిత్రీకరిస్తుంటే.. చీము, నెత్తురు ఉన్న రాష్ట్ర బిజెపి నేతలు నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. అది తప్పు తెలంగాణ ఆకాంక్షల మేరకే తెలంగాణ ఏర్పాటు చేశారని ఎందుకు చెప్పలేకపోతున్నారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే మొన్న పిఎం తో మీటింగ్ లో పాల్గొన్న బిజెపి ఎంపీలు ఎందుకు అడగలేదో చెప్పాలని అన్నారు. కుల గణన సర్వే పూర్తయిన దశలో ఉందని.. ఇప్పటికీ సర్వే చేయించుకొని వారు ఎన్యూమరేటర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.