బీసీ గురుకుల స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్

బీసీ గురుకుల స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్
  • జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పతకాలు సాధించిన స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు :  జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పతకాలు సాధించిన బీసీ గురుకుల విద్యార్థులను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. నల్గొండ జిల్లా తుమ్మడం బీసీ గురుకుల పాఠశాలకు చెందిన జి. భవజ్ఞ జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించగా, ఎం.అక్షయ (8వ తరగతి),  కె.హరిప్రియ (7వ తరగతి),  జె.మనశ్విని (8వ తరగతి) రజత పతకాలు సాధించారు.  

వీరంతాసెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సోమవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.