Telangana Assembly: పదేళ్లలో మీరెప్పుడైనా ఆటోడ్రైవర్లకు సాయం చేశారా.?: పొన్నం

Telangana Assembly:  పదేళ్లలో  మీరెప్పుడైనా  ఆటోడ్రైవర్లకు సాయం చేశారా.?: పొన్నం

ఆటో డ్రైవర్లను పట్టించుకోవడం లేదన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి కామెంట్స్ పై మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ నేతలు  పదేళ్లలో ఆర్టీసీ కార్మికులను, సిబ్బందిని  ఆగం చేశారని ధ్వజమెత్తారు పొన్నం ప్రభాకర్.  ఆటో డ్రైవర్లను బీఆర్ఎస్ నేతలు  రెచ్చగొడుతున్నారని విమర్శించారు.  ఆటో కార్మికులు తెలంగాణ బిడ్డలని చెప్పారు.  ఇచ్చిన హామీలన్నీ తప్పక నెరవేరుస్తామన్నారు. మేర

ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్  అన్యాయం చేయదన్నారు.  ధైర్యం ఉంటే మహిళలకు ఫ్రీ జర్నీ  వద్దా..లేదా అన్నది  బీఆర్ఎస్  నేతలు చెప్పాలని సవాల్ విసిరారు పొన్నం ప్రభాకర్. 21 మంది ఆత్మహత్య చేసుకున్నారని..  బీఆర్ఎస్ నేతలు సభను తప్పుదోవపట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.   బెంజ్ కార్ల తిరిగినోళ్లు..ఇవాళ ఆటోలో వస్తూ అవమానిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎప్పుడైనా ఆటోడ్రైవర్లను ఆదుకుందా అని ప్రశ్నించారు.

Also read : తాళి కట్టి.. తొలి రాత్రి అదృశ్యమైన పెళ్లి కొడుకు.. మూడు రోజుల తర్వాత..