తాళి కట్టి.. తొలి రాత్రి అదృశ్యమైన పెళ్లి కొడుకు.. మూడు రోజుల తర్వాత..

తాళి కట్టి.. తొలి రాత్రి అదృశ్యమైన పెళ్లి కొడుకు.. మూడు రోజుల తర్వాత..

అతను బ్యాంక్ ఉద్యోగి.. బాగా సంపాదిస్తున్నాడు.. డబ్బున్న కుటుంబం.. దీంతో ఇంట్లో కుదిర్చిన పెళ్లికి ఓకే చెప్పాడు.. గ్రాండ్ గా పెళ్లి జరిగింది.. అమ్మాయి ఇంట్లో జరిగిన పెళ్లి తర్వాత.. భార్యను తీసుకుని తన ఇంటికి వచ్చాడు. ఆ రాత్రి ఎవరికీ చెప్పకుండా అదృశ్యం అయ్యాడు.. అంతా కంగారు.. భయపడ్డారు. కనిపించకుండా పోయిన కొత్త పెళ్లి కొడుకు ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. దీంతో రెండు కుటుంబాల భయపడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బ్యాంక్ ఉద్యోగి కావటం,, డబ్బున్న ఫ్యామిలీ కావటంతో స్వయంగా రంగంలోకి దిగారు జిల్లా ఎస్పీ.. ఇంతకీ పెళ్లి కొడుకు దొరికాడా లేదా అనేది చూద్దాం..

బీహార్ రాష్ట్రం. షాబాజ్ పూర్ గ్రామానికి చెందిన ఆదిత్య షాహీ. భగల్ పూర్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఫిబ్రవరి 4వ తేదీ పెళ్లి జరిగింది. అదే రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. బయటకు వెళ్లిన కుమారుడు ఎంతకీ తిరిగి రాలేదు. భయపడ్డారు. పెళ్లి కూతురిని ప్రశ్నించారు. ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా అని.. లేదని సమాధానం వచ్చింది. రాత్రంతా చూసి పోలీస్ కంప్లయింట్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగారు. ఇంటికి దగ్గరలోని ఓ ఏటీఎంలో 50 వేల రూపాయలు డ్రా చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాప్.. ఎంతకీ ఆచూకీ దొరకలేదు. తీరా మూడు రోజుల తర్వాత ఫోన్ ఆన్ అయ్యింది. అప్పటికే నిఘా పెట్టిన పోలీసులు.. ఆగ్రా వెళ్లే రైలులో ఉన్నట్లు గుర్తించారు. రైల్వే, స్థానిక పోలీసులను అలర్ట్ చేశారు. ఆ పోలీసులు కొత్త పెళ్లి కొడుకు ఆదిత్య షాహీని ఆగ్రా రైల్వేస్టేషన్ లో పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మూడు రోజులపాటు బస్సులు, రైళ్లలో తిరుగుతూ ఉన్నానని.. ఆగ్రాలో ఎక్కడికి వెళ్లాలి అనే విషయాన్ని తెలుసుకోవటం కోసం ఫోన్ ఆన్ చేసినట్లు చెప్పాడు. పెళ్లి జరిగిన రాత్రి అదృశ్యం అవ్వటంపై మాత్రం సమాధానం చెప్పటం లేదంట.. ఈ మూడు రోజులు ఎక్కడికి వెళ్లాడు.. ఎక్కడెక్కడ ఉన్నాడు అనేది కూడా చెప్పటం లేదు. అసలు ఇంటి నుంచి వెళ్లిపోవటానికి కారణాలు కూడా చెప్పటం లేదంట. దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా.. ఉద్యోగంలో ఒత్తిడి ఉందా లేక ఇంట్లో సమస్యలా.. పెళ్లి ఇష్టం లేదా ఇలాంటి కారణాలపై విచారణ చేస్తున్నారు పోలీసులు.. మొత్తానికి కొత్త పెళ్లి కొడుకు.. తొలి రాత్రి అదృశ్యం అయ్యి.. మూడు రోజుల తర్వాత దొరకటం.. అందులోనూ పెద్దింటి కుటుంబ వ్యవహారం కావటంతో బీహార్ ఆసక్తిగా.. చర్చనీయాంశం అయ్యింది.

Also Read : పదేళ్లలో మీరెప్పుడైనా ఆటోడ్రైవర్లకు సాయం చేశారా.?: పొన్నం