ప్రజలకు న్యూ ఇయర్శుభాకాంక్షలు : మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రజలకు న్యూ ఇయర్శుభాకాంక్షలు : మంత్రి పొన్నం ప్రభాకర్
  •    రాష్ట్ర- రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.  ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన రిలీజ్​చేశారు. 2025లో సాధించిన విజయాలు, తీపి గుర్తులు ప్రతీ ఒక్కరి జీవితానికి ప్రేరణగా నిలవాలని ఆకాంక్షించారు. 

కొత్త ఏడాది మరిన్ని విజయాలు, శుభ ఫలితాలు, ఆరోగ్యం, అభివృద్ధిని అందించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో యువతకు విస్తృత అవకాశాలు రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.