- పదేండ్లలో నీళ్లివ్వనోళ్లు అధికారంలోకి రాగానే 24 గంటలు నీళ్లిస్తరట!
- కేటీఆర్ కామెంట్స్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా
- గత ప్రభుత్వంలో ఒక్క ఎంజీడీ నీళ్లు కూడా తేలేకపోయారు
- రూ.7 వేల కోట్లతో గోదావరి ఫేజ్ 2, 3 పనులు చేస్తున్నామని వెల్లడి
హైదరాబాద్‌సిటీ, వెలుగు: బీఆర్ఎస్ప్రభుత్వ పదేండ్ల పాలనలో హైదరాబాద్నగరానికి ఒక్క ఎంజీడీ నీటిని కూడా అదనంగా తీసుకురాలేకపోయారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కానీ, ఆ పార్టీ వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్మాత్రం అధికారంలోకి రాగానే 24 గంటలు నీళ్లిస్తామని నీటి మాటలు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ప్రభుత్వ హయాంలో నగరంలో భవిష్యత్ నీటి సరఫరాపై సరైన ప్రణాళికలేక పోవడం వల్లనే నీటి సమస్యలు వస్తున్నాయన్నారు.
మంగళవారం వాటర్‌బోర్డు ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి అజారుద్దీన్, బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి, జేఎండీ మయాంక్ మిట్టల్, ప్రాజెక్ట్ డైరెక్టర్సుదర్శన్తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు కలల ప్రపంచంలో విహరిస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతలు నీళ్లు రావట్లేదని వాటర్‌బోర్డు ముందు ఉద్దేశపూర్వకంగా ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సిటీకి తాగునీటిని అందించేందుకు కాంగ్రెస్హయాంలోనే అనేక ప్రాజెక్టులు వచ్చాయని గుర్తు చేశారు.
ముఖ్యంగా మంజీరా, సింగూరు, కృష్ణా ప్రాజెక్టు–1, 2,3 దశలతో పాటు గోదావరి మొదటి దశ వరకూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టినవేనని వెల్లడించారు. ప్రస్తుతం 7వేల కోట్లతో గోదావరి–2, 3 దశల ప్రాజెక్టు పనులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినవేనని అన్నారు. భవిష్యత్ అవసరాలకు కృష్ణా– 4, 5 దశల ప్రాజెక్టును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని అన్నారు. కోర్అర్బన్రీజియన్ (క్యూర్) వరకూ విస్తరించిన బోర్డు పరిధిలో ప్రస్తుతం 14.50 లక్షల నీటి కనెక్షన్లకు రోజుకు 560 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో 6.23 లక్షల కనెక్షన్లకు ఉచిత నీటి సరఫరా జరుగుతోందన్నారు.
నీటి సరఫరా సమస్యలు రాకుండా చర్యలు
గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఎలాంటి నీటి సమస్యలు రాకుండా మెట్రోవాటర్‌బోర్డు ప్రణాళికాబద్ధంగా తాగునీటిని సరఫరా చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్వివరించారు. నగరంలోడ్రింకింగ్ వాటర్ సమస్యలను, ఫిర్యాదులను ఎప్పటికపుడు పరిష్కరిస్తున్నామని అన్నారు. గతేడాది అత్యధిక వర్షపాతం నమోదైందని అన్నారు. ఈసారి ఏప్రిల్, మే నెలల్లో వర్షాలు పడలేదని అన్నారు. అయినా సమ్మర్ లో నీటి సమస్యలు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని దీంతో ఇప్పటికే ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు
