- యూసుఫ్‌గూడలో మంత్రి పొన్నం ఇంటింటి ప్రచారం
- బ్రహ్మణ సమాజాన్ని బీఆర్ఎస్ పట్టించుకోలే: మంత్రి శ్రీధర్ బాబు
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పటి దాకా 55వేల రేషన్ కార్డులు పంపిణీ చేశామని తెలిపారు. యూసుఫ్‌గూడలో బుధవారం నిర్వహించిన బైక్ ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున ఇంటింటి ప్రచారం చేశారు. కృష్ణానగర్‌లో పిల్లి పద్మ, ఆంజనేయులు యాదవ్ ఇంట్లో పార్టీ నేతలతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఏ రాష్ట్రంలో అమలు చేయని సన్న బియ్యం పథకం తెలంగాణ అమలు చేస్తున్నదని తెలిపారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతున్నదన్నారు. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రునాలు, అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తున్నామన్నారు. సమావేశం ప్రారంభంకాకముందే ఖాళీ కుర్చీల ఫొటోలు తీసి బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అసహనం వ్యక్తం చేశారు.
శ్రీనగర్ కాలనీ, వడ్డెర బస్తీలో ఆయన ప్రచారం చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ బ్రాహ్మణ వర్గానికి ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. శ్రీనగర్‌కాలనీలోని సత్యసాయి నిగమాగనంలో బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రాహ్మణ కార్తీక వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.
