కీసర, వెలుగు: కీసర గుట్ట రామలింగేశ్వర స్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ మండపంలో మంత్రిని సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు
