గౌరవెల్లి ప్రాజెక్టుకి రూ. 431 కోట్లు రిలీజ్ చేశాం: మంత్రి పొన్నం

గౌరవెల్లి ప్రాజెక్టుకి రూ. 431 కోట్లు రిలీజ్ చేశాం: మంత్రి పొన్నం

దేశంలో ఎక్కడ లేని విధంగా  సీఎం రేవంత్ రెడ్డి  నాయకత్వంలో  రైతులకు రుణమాఫీ చేశామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరంలో వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పొన్నం.. ఇప్పటికే లక్షన్నర లోపు  ఉన్న వారికి రుణమాఫీ జరిగిందన్నారు.  

వచ్చే వారం రోజుల్లో 2 లక్షల  వరకు రుణమాఫీ జరుగుతుందన్నారు పొన్నం.  వ్యవసాయంలో సంప్రదాయ పంటల్లో వచ్చే ఆదాయం కన్నా అధిక ఆదాయం రావాలంటే భిన్నమైన పంటలు వేయాలని సూచించారు పొన్నం.  మీకు కావాల్సిన పథకాలపై దరఖాస్తు చేసుకున్న నుంచి బ్యాంక్ లోన్ల వరకు అన్ని ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టుకి 431.50 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. ప్రాజెక్ట్ పూర్తి చేసి రైతుల ముఖాల్లో  ఆనందం చూడాలన్నారు పొన్నం.