మొదలైన మంత్రి పొన్నం ప్రభాకర్ నిరసన దీక్ష

మొదలైన మంత్రి పొన్నం ప్రభాకర్ నిరసన దీక్ష

రిజర్వేషన్ల ప్రక్రియ ఉండాలని ఓటుతో పాటు సమాన న్యాయం ఉండాలని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దేశ భవిష్యత్ కు దిక్సూచిగా మారిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అంబేద్కర్ సూచించిన మార్గంలో రాష్ట్ర మంత్రిగా,ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తన బాధ్యతను నెరవేరుస్తానన్నారు. బీ.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. 

మరోవైపు 10 ఏళ్ల బీజేపీ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయంపై, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై  మంత్రి పొన్నం నిరసన దీక్ష చేపట్టారు.  మధ్యాహ్నాం 2 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. కరీంనగర్ లోని ఇందిరా భవన్ లో  నిరసన దీక్ష  ప్రారంభించారు.  ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్,  డా.కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కరీంనగర్, సిరిసిల్ల, హుజురాబాద్ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిలు,కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.