జీతాలు ఒకటో తేదీ ఇవ్వలేని దుస్థితికి తీసుకొచ్చారు : హరీశ్ కు మంత్రి పొన్నం కౌంటర్

జీతాలు ఒకటో తేదీ ఇవ్వలేని దుస్థితికి తీసుకొచ్చారు : హరీశ్ కు మంత్రి పొన్నం కౌంటర్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.  రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై  కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయగా దానిపై హరీష్ రావు మాట్లాడారు.  దేశంలోని కేంద్ర ప్రభుత్వమైనా,  ఏ రాష్ట్రంలోనైనా డబ్బులు బీరువాల్లో, అల్మారుల్లో కట్టల రూపంలో ప్రభుత్వం దగ్గర  నిలువ ఉండవని అన్నారు. 

ఖజనా రావడం పోవడం అనేది ఓ నిరంతరమైన ప్రక్రియ అని హరీష్ రావు చెప్పారు. రాష్ట్రాన్ని దివాళా తీయించారు, ఖజానా ఖాళీ అనడం సుద్ద తప్పని హరీష్ రావు చెప్పారు. అయితే దీనిపై మంత్రి పొన్నం స్పందించారు. అర్బటానికి, అట్టహసానికి రాష్ట్రంలో ఇబ్బంది లేదు కానీ  ఉద్యోగులకు  జీతాలు, పెన్షన్లు ఒకటో తేదీ ఇవ్వలేని దుస్థితికి రాష్ట్ట్రానికి తీసుకొచ్చారని కౌంటర్  ఇచ్చారు.