గుడ్ న్యూస్: ప్రతీ గ్రామానికి వాటర్ ప్లాంట్

గుడ్ న్యూస్: ప్రతీ గ్రామానికి వాటర్ ప్లాంట్

సిద్దిపేట: తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని.. ఆడ బిడ్డలకు ఏ కష్టం రానివ్వమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడలో ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీచేశారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ 'రాష్ట్రం లో మేం పవర్లోకి రాగానే అనేక కార్యక్రమాలు చేపట్టాం. మహిళా సంఘాలకు 10 ఏండ్లపాటు వడ్డీలేని రుణాలు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు ఇచ్చాం. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి బొ ట్టుపెట్టి మహిళా సంఘాల వాళ్లు చీరలు సారే ఇస్తున్నారు. 

మహిళలు ఆర్థిక వృద్ధి సాధించిఉన్నత శిఖరాలకు ఎదగాలి. రాష్ట్రంలో ఎక్కడ మహిళా సంఘాల మీటింగ్ జరిగిన హుస్నాబాద్ స్టీల్ బ్యాంక్ ద్వారా ప్లాస్టిక్ రహిత నియోజ కవర్గంగా మారిందని చెప్పండి. త్వరలోనే ప్రతీ మండలానికి ఒక కాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ సెంటర్ రాబోతుంది. డాక్టర్లే వచ్చి మెడికల్టెస్టులు చేస్తారు. ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇవ్వండి మరిన్ని మంచి కార్యక్రమాలతో ముందుకు పోతాం. నాకు ఒక అక్క చెల్లె ఉన్నారు. మా ఆడ బిడ్డలతో సమానంగా మిమ్మల్ని చూసుకుంటా, ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తం. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసి ఈ ప్రాంతా న్ని సస్యశ్యామలం చేస్తం. మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం' అని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు