
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించకున్నారు. ఆలయ అధికారులు మంత్రి పొన్నంకు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి రుద్రాభిషేకం.. అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు పొన్నం.
ఇవాళ్టి నుంచి శ్రావణ మాసం ప్రారంభం కావడంతో శ్రీశైలం ఆలయానికి పోటెత్తారు భక్తులు.. శ్రీశైలం ఘాట్ రోడ్లన్నీ ట్రాఫిక్ జాం అయ్యాయి. సోమవారం ఉదయం నుంచే క్యూలైన్లో నిలుచున్నారు. దర్శనానికి ఇంకా భారీగా తరలివస్తున్నారు. ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.స్వామి వారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.