పంజాగుట్ట, వెలుగు: నిమ్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న నాగర్ కర్నూల్మాజీ ఎంపీ మంద జగన్నాథంను మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారంపరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. హార్ట్ స్ట్రోక్ కారణంగా ఈ నెల 22న మంద జగన్నాథం నిమ్స్‌లో అడ్మిట్అయ్యారు. ప్రస్తుతం ఆర్ఐసీయూలో ఆయనకు ట్రీట్మెంట్ కొనసాగుతున్నది.
