
మేడిగడ్డ ప్రాజెక్ట్ ను మంత్రులు సందర్శించారు. గత ప్రభుత్వం నిర్మాణంలో రూల్స్ పాటించనందుకే కుంగి పోయిందని మంత్రి పొంగులేటి అన్నారు. టాప్ లాగ్ గేట్స్ పనిచేయకపోయినందుకే కుంగిపోయిందన్నారు. తన మార్కు కనిపించాలనే ఉద్దేశంతోనే మేటిగడ్డ బ్యారేజ్ ను నిర్మించారన్నారు. ఈ ప్రాజెక్ట్ ఖర్చు ప్రతి పైసా కూడా అప్పు చేసి గత ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఇప్పుడు ఆ సొమ్ముకు మార్కెట్ రేటు కంటె 12 శాతం ఎక్కువ వడ్డీ కడుతున్నామ్నారు. లక్ష కోట్లతో 50 టీఎంసీలు ఎత్తిపోస్తున్నారున్నారు. మేడిగడ్డ నష్టాన్ని ఏజన్సీతో కట్టిస్తారా లేదా అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. గత ప్రభుత్వం ప్రజలపై ఎంత భారం పడుతుందో ఆలోచించలేదన్నారు. ఇది ఒక్క పిల్లర్ తో ఆగేదని కాదన్నారు.
కాళేశ్వరం డ్యామేజ్ కావడం దురదృష్టకరమన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో సమీక్షించారు. లక్షల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులకు బిల్డర్లదే బాధ్యత అని మంత్రి పొంగులేటి అన్నారు. ఇంత భారీ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలను బయటపెడతామన్నారు. మేడిగడ్డలో పిల్లర్లు కుంగిపోవడంతో నీటిని నిల్వ చేసుకోలేకపోతున్నారు. నదిలో నీటిని దిగువకు విడుదల చేయాల్సిందేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి శ్రీధర్ బాబు ఏమన్నారంటే
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో గత ప్రభుత్వ హయాంలో 67 వేల 406 కోట్ల రూపాయిల అవినీతి జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మేడిగడ్డలో నీరు నిల్వ చేస్తే నీళ్లు నిల్వ చేసిననప్పుడు ఊళ్లు ముంపునకు గురవుతున్నాయి.కాళేశ్వరం అవినీతిని వెలికితీస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రాజెక్ట్ పై రూపాయి ఖర్చు చేస్తే 50 పైసలు రాబడి మాత్రమే ఉందన్నారు. భారీ వర్షాలకు పంప్ హౌస్ లు ముంపునకు గురయ్యాయన్నారు. సాంకేతిక లోపం ఎవరి నిర్ణయాల వల్ల వచ్చిందని ప్రశ్నించారు. 3వ టీఎంసీ పనులను నామినేషన్ పై ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి...
మేడిగడ్డ ప్రాజెక్ట్ విషయంలో తమ అనుమానాలు నిజమయ్యాయని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మేడిగడ్డ కుప్పకూలినప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించలేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. మూడేళ్లలో కాళేశ్వరం కుప్పకూలడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. కాళేశ్వరం పై మా పార్టీ విధానం ఒకటే.. ప్రాణహిత చేవెళ్ల ని 35 వేల కోట్లతో నిర్మించాలి అనేది మా విధానం అన్నారు. కానీ ప్రాజెక్టు కట్టే పనిలో ఉండగా ప్రభుత్వం మారిందన్నారు. మా ప్లాన్ మార్చేసి.. ప్రాజెక్టు లొకేషన్ మార్చింది బీఆర్ఎస్ అన్నారు. పదేళ్ళలో ఏం జరిగిందో అందరికి తెలుసన్నారు. 35 వేల కోట్ల తో మేము కట్టలి అనుకున్నది.. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లకు పెరిగిందన్నారు. కాళేశ్వరం ప్రారంభం నుండే మాకు అనుమానాలు ఉన్నాయన్నారు.