18 ఏళ్లు నిండిన విద్యార్థులు వ్యాక్సిన్ వేసుకోవాలి

18 ఏళ్లు నిండిన విద్యార్థులు వ్యాక్సిన్ వేసుకోవాలి

విద్యాసంస్థల్లో కరోనా వ్యాప్తిపై ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని..తగిన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు మంత్రి  సబితా ఇంద్రారెడ్డి. ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఏమీ లేవని అన్నారు. విద్యా సంస్థల్లో కూడా 100 శాతం రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా,ఒమిక్రాన్, వాక్సినేషన్ పై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. 

కరోనా వ్యాప్తిపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని అన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ముఖ్యంగా విద్యా సంస్థల్లో ప్రస్తుతం అలాంటి ఆందోళనకర పరిస్థితులు లేవన్నారు. కొవిడ్ నామ్స్ ప్రకారం విద్యా సంస్థలు నడుస్తున్నాయన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే  విద్యార్ధులు రెండేళ్లు నష్టపోయారని.. విద్యార్ధుల భవిష్యత్ పై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగానే ..విద్యా సంస్థలలో కూడ 100 శాతం  వ్యాక్సిన్ వేసేందు చర్యలు చేపట్టామన్నారు.

18 ఏళ్లు నిండిన విద్యార్థులు వ్యాక్సిన్  వేసుకోవాలని కోరారు. అంతేకాదు విద్యార్ధుల తల్లిదండ్రులు కూడా రెండు డోసులు తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్ అందుబాటులో ఉందని...సెకండ్ డోస్ వేసుకోని వారు  వెంటనే వేసుకోవాలన్నారు.దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులు,అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.