‘వ్యాక్సిన్ పై అనుమానాలు అక్కర్లేదు.. వైరస్ కట్టడిలో మనమే ముందున్నాం’

‘వ్యాక్సిన్ పై అనుమానాలు అక్కర్లేదు.. వైరస్ కట్టడిలో మనమే ముందున్నాం’

క‌రోనా వ్యాక్సిన్ పై జనానికి అనుమానాలు అవసరం లేదని అన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తీసుకున్న చర్యలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే కరోనా కట్టడిలో ముందుందని ఆమె పేర్కొన్నారు. కోవిడ్-19 వాక్సినేషన్ లో భాగంగా శనివారం నాడు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో వాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రపంచ మానవాళి ని వేధించిన కరోనా కు చరమగీతం పాడేలా ఈ వాక్సిన్ దోహధపడుతుందనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేసారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 139 కేంద్రాల్లో టీకా పంపిణీ చేయడం జరుగుతుందని, తొలి దశలో 3.15 లక్షల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ కు టీకాలు వేయనున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ పరిధిలోని డీ.సీ.జీ.ఐ ఆమోదం పొందిన వ్యాక్సిన్‌ మాత్రమే అందించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.కరోనా కాలంలోనే ధైర్యంగా ఉండి, ప్రజల ప్రాణాలను కాపాడటానికి తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కె మొదటి ప్రాధాన్యత గా టీకా లు వేయడం జరుగుతుందన్నారు. ఈ రోజు మొదటి డోసు వేసుకున్న వారికి,20 రోజుల తరువాత రెండో డోసు వేయటం జరుగుతుంది.

ఈ రోజు వాక్సిన్ ప్రక్రియ సజావుగా సాగిందని,సెంటర్ ల వద్ద అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా వైద్యులు అందుబాటులో ఉంటారని మంత్రి అన్నారు. వికారాబాద్ జిల్లాలో మూడు సెంటర్ లలో 90 మందికి శనివారం నాడు వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. 18 వ తేదీ నుండి 28 సెంటర్ లలో 5395 మందికి మొదటి విడత వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని, కరోనా పూర్తిగా తొలగిపోవాలి అని ప్రార్థిస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు అన్నారు. ప్రధాన మంత్రి గారు దేశవ్యాప్తంగా ఈ రోజు వాక్సినేషన్ ను ప్రారంభించారని,ఈ వాక్సిన్ కరోనా నుండి అందరిని కాపాడాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల వాక్సిన్ వేయించుకున్న ఆరోగ్య,అంగన్వాడి కార్యకర్తల తో మాట్లాడారు. మంత్రి వెంట జడ్పీ చైర్ పర్సన్ సునీత రెడ్డి గారు,పరిగి,చేవెళ్ళ ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి గారు,కాలే యాదయ్య గారు,జిల్లా కలెక్టర్ పౌసుమి బసు , జిల్లా వైద్యాధికారి,తదితరులు ఉన్నారు